చలికాలంలో మార్నింగ్ వాకింగ్.. మీ గుండె ఆరోగ్యం ప్రమాదంలో ఉన్నట్లే!
చలి రోజురోజుకూ పెరుగుతోంది. ఈ సీజన్‌లో ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం చాలా అవసరం. చిన్న నిర్లక్ష్యమే ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉంది. ముఖ్యంగా శీతాకాలంలో మార్నింగ్ వాక్ చేయడం ఆరోగ్యానికి మంచిదని చాలామంది భావిస్తారు. కానీ చలికాలంలో ఉదయపు నడక గుండె ఆరోగ్యానికి ముప్పుగా మారవచ్చని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. చలి ఎక్కువగా ఉండే సమయంలో శరీరం తనను తాను వెచ్చగా ఉంచుకోవడానికి రక్తనాళాలు సంకోచిస్తాయి. దీని వల్ల రక్తపోటు పెరిగి గుండెపై అదనపు ఒత్తిడి…

