డీజీపీ శివధర్ రెడ్డికి హైకోర్టులో బిగ్ రిలీఫ్.. నియామకం రద్దు పిటిషన్ కొట్టివేత
రాష్ట్ర డీజీపీగా శివధర్ రెడ్డి నియామకానికి సంబంధించి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. శివధర్ రెడ్డి నియామకాన్ని రద్దు చేయాలంటూ దాఖలైన మధ్యంతర పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేయడంతో ఆయనకు భారీ ఊరట లభించింది. అయితే రెగ్యులర్ డీజీపీ నియామక ప్రక్రియను నాలుగు వారాల్లో పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మరియు యూపీఎస్సీని హైకోర్టు ఆదేశించింది. నియామక ప్రక్రియపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన న్యాయస్థానం, తదుపరి విచారణను ఫిబ్రవరి 5కు వాయిదా వేసింది. డీజీపీ…

