ఖైరతాబాద్‌లో పీజీఆర్ వారసత్వం — రాజకీయ సాంప్రదాయాలపై మళ్లీ చర్చ
తెలంగాణ రాజధాని హైదరాబాదులోని ప్రముఖ నియోజకవర్గం ఖైరతాబాద్ ఎన్నాళ్లుగానో పేద ప్రజల ఆశలు–ఆకాంక్షలకు కేంద్రంగా నిలిచింది. ఈ ప్రాంతానికి పునాది వేసి, పేదలకు అండగా నిలబడి, అనేకసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రజల గుండెల్లో చిరస్మరణీయుడైన నేత పి. జనార్ధన రెడ్డి (పీజీఆర్). తండాలు, గూడాలు, మారుమూల బస్తీలు…హైదరాబాద్‌కు ఉద్యోగాల కోసం వచ్చిన వలస కుటుంబాలకు అండగా నిలిచిన పీజీఆర్, “పేదల దేవుడు”గా పేరుపొందారు. 2007లో పీజీఆర్ గుండెపోటుతో అకస్మాత్తుగా మృతి చెందగా, ఖైరతాబాద్‌తో పాటు మొత్తం హైదరాబాదు…

