హైదరాబాద్ అభివృద్ధి లేదు, ప్రజల బతుకులు మారలేదు – బీజేపీ నేత సూటి వ్యాఖ్యలు
హైదరాబాద్ నగరంలో అభివృద్ధి పేరుతో వాస్తవానికి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు మారలేదని ఒక బీజేపీ నేత ఘాటుగా విమర్శించారు. “పదేళ్ల టిఆర్ఎస్ పాలనలో ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా రహమత్ నగర్‌లో కనబడలేదని” ఆయన వ్యాఖ్యానించారు. ఆయన మాట్లాడుతూ — “కేటీఆర్ ఎయిర్‌కండీషన్డ్ హాల్లో కూర్చొని ‘హైదరాబాద్ బంగారు నగరం అయింది’ అంటాడు. కానీ రోడ్ల మీద చెత్త కుప్పలు, మూత్ర వాసన తప్ప అభివృద్ధి కనిపించడం లేదు,” అని అన్నారు. ప్రజల పరిస్థితిని ఉద్దేశించి…

