సుదర్శన్ రెడ్డికి క్యాబినెట్ హోదా — ఆరు గ్యారెంటీల అమలు బాధ్యతలు అప్పగింత

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ మంత్రి మరియు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిను రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ సలహాదారుడిగా నియమించింది. ఈ నిర్ణయాన్ని శుక్రవారం ప్రధాన కార్యదర్శి రామకృష్ణ అధికారికంగా ఉత్తర్వుల రూపంలో ప్రకటించారు. ఆయనకు క్యాబినెట్ హోదా ఇవ్వబడింది మరియు మంత్రివర్గ సమావేశాలకు ప్రత్యేక ఆహ్వానితునిగా హాజరు అయ్యే అవకాశం కల్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు ప్రక్రియను పర్యవేక్షించే బాధ్యతలను సుదర్శన్ రెడ్డి చేపట్టనున్నారు. ఈ క్రమంలో ఆయన…

Read More

కంటోన్మెంట్ లో ప్రజల గోడు: డ్రైనేజ్, మౌలిక సదుపాయాల లోపం పై ఆగ్రహం

కంటోన్మెంట్ ఉప ఎన్నికల వేళ ప్రజల సమస్యలు మళ్లీ తెరపైకి వచ్చాయి. “ఎన్నికల సమయంలో మాత్రమే నాయకులు కనిపిస్తారు, తరువాత మాత్రం ఎవరూ పట్టించుకోరు” అంటూ స్థానికులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. గల్లీల్లో నీటి పెంగులు, డ్రైనేజ్ సమస్యలు, దోమల ప్రబలంతో ఆరోగ్య సమస్యలు తీవ్రమవుతున్నాయని, పలు ఫిర్యాదులు చేసినా అధికారులు స్పందించడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. వర్షం వచ్చిన ప్రతిసారి ఇళ్లలో నీరు చేరి పిల్లలు, పెద్దలు రోగాలతో బాధపడుతున్నారని పేర్కొన్నారు….

Read More

జూబిలీహిల్స్ షేక్‌పేట్ ప్రజల ఆగ్రహం: “10 ఏళ్లుగా సమస్యలు… ఎవరూ పట్టించుకోలేదు”

జూబిలీ హిల్స్ నియోజకవర్గంలోని షేక్‌పేట్ డివిజన్‌లో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దాలుగా వరదలు, డ్రైనేజ్ సమస్యలు, దోమల ఉక్కిరిబిక్కిరి పరిస్థితి కొనసాగుతున్నా, ఏ ప్రభుత్వం తమను పట్టించుకోలేదని స్థానికులు మండిపడ్డారు. వర్షాలు వస్తే ఇళ్లలోకి నీళ్లు చేరి బియ్యం, పప్పులు, గృహసరుకులు పాడైపోతున్నాయని, అయినా అధికారులు స్పందించడం లేదని వేదన వ్యక్తం చేశారు. “పది సంవత్సరాలు టీఆర్ఎస్, ఇప్పుడున్న కాంగ్రెస్ సర్కార్ — ఎవ్వరూ మా గల్లీ లోకి రాలేదు” అంటూ ప్రజలు ఆగ్రహంగా…

Read More

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక: నవీన్ యాదవ్ క్యాంప్‌లో ఆంతర్రంగిక ఉద్రిక్తతలు, క్యాడర్ అసంతృప్తి, రాజకీయ వ్యూహాలపై ప్రశ్నలు

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ చుట్టూ పలు రాజకీయ చర్చలు, విమర్శలు, క్యాడర్‌లో అసంతృప్తి వంటి అంశాలు బయటకు వస్తున్నాయి. సోషల్ మీడియా వేదికల్లో వచ్చిన వ్యాఖ్యలు, స్థానిక రాజకీయ కార్యకర్తల అభిప్రాయాలు, ప్రజా చర్చల ఆధారంగా కొన్ని ప్రధాన పరిశీలనలు వెలుగులోకి వచ్చాయి. కుటుంబంపై బైండ్-ఓవర్ చర్యల ప్రభావం ఎన్నికల నిబంధనల ప్రకారం పోలీస్ శాఖ కొంతమంది రౌడీషీటర్స్ పై బైండ్-ఓవర్ చర్యలు చేపట్టింది.ఈ క్రమంలో నవీన్…

Read More

జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై కాంగ్రెస్ దృష్టి – మంత్రులే ప్రచార బాధ్యతలు చేపట్టారు

జూబ్లీహిల్స్ ఉపఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అధికార కాంగ్రెస్ పార్టీ, పోలింగ్ తేదీ సమీపిస్తున్న కొద్దీ మరింతగా దృష్టి సారిస్తోంది. ఇప్పటివరకు ముగ్గురు మంత్రులే ఈ ఉపఎన్నిక పర్యవేక్షణలో ఉండగా, ఇప్పుడు మొత్తం కేబినెట్‌ను రంగంలోకి దించాలని నిర్ణయించింది. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో నియోజకవర్గంలోని ఏడు డివిజన్లకు గాను ఒక్కో డివిజన్‌కు ఇద్దరు మంత్రుల చొప్పున బాధ్యతలు అప్పగించారు. ప్రతి మంత్రికి తమ పరిధిలో ప్రచారం చేయడమే కాకుండా, స్థానిక సమస్యలపై…

Read More

జూబ్లీహిల్స్ రాజకీయ సమీకరణాలు మారుతున్నాయా? – కేటీఆర్, రేవంత్ వ్యూహాలతో హీట్ పెరిగింది

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఈసారి పోరు ప్రధానంగా బీఆర్‌ఎస్ మరియు కాంగ్రెస్ మధ్యే జరగనుంది. బీజేపీ ప్రభావం ఈ ప్రాంతంలో తక్కువగా ఉందని విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికే రెండు పార్టీలు కూడా సెటిలర్ ఓటు బ్యాంక్ పై దృష్టి సారించాయి. ఈ ఓట్లు ఏ వైపుకు మళ్లతాయన్నది గెలుపు ఓటములపై కీలక ప్రభావం చూపనుంది. సమాచారం ప్రకారం, బీఆర్‌ఎస్ నాయకుడు కేటీఆర్ ఇటీవల టిడిపి నాయకుడు నారా లోకేష్ తో భేటీ అయ్యారు….

Read More

ఆటో డ్రైవర్స్‌కు ₹24,000 బకాయిలు చెల్లించండి – రేవంత్ ప్రభుత్వంపై బిఆర్ఎస్ ఆగ్రహం

తెలంగాణలో మళ్లీ రాజకీయ వేడి చెలరేగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బిఆర్ఎస్ తీవ్ర విమర్శలు గుప్పించింది. ఎన్నికల సమయంలో ఆటో డ్రైవర్స్‌కు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా మోసం చేసిందని బిఆర్ఎస్ ఆరోపించింది. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రతి ఆటో డ్రైవర్‌కు సంవత్సరానికి ₹12,000 ఆర్థిక సాయం, ప్రమాద బీమా ₹10 లక్షల వరకు, ఆటో నగర్ నిర్మాణం, మరియు ఆటో డ్రైవర్స్ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేస్తామని హామీ…

Read More

సెక్రటరియట్‌లో దుద్దిల శ్రీధర్ కేసు: కుంభకోణం, అధికారులు, మీడియా నిర్లక్ష్యం

ప్రస్తుతం సెక్రటరియట్‌లో జరుగుతున్న దుద్దిల శ్రీధర్ కేసు సమాజంలో పెద్ద దృష్టికోణాన్ని తెచ్చింది. ప్రధాన పత్రికలు, ప్రధాన టీవీలు ఈ వ్యవహారాన్ని చూపించకపోవడం చాలా బాధాకరం. దుద్దిల శ్రీధర్ గారి ఆఫీసు రాత్రి 12 వరకు పనిచేస్తుంది, ఇది సాధారణ ఆఫీసు ప్రాక్టీసుకి విరుద్ధంగా ఉంది. రాత్రి ఈ ఆఫీసులో జరిగిన దందాలకు అడ్డంగా మారడంతో ఈ విషయం వెలికితీస్తుంది. కల్యాణరాజు గారి దరఖాస్తు ప్రకారం, సెక్రటరియట్ వేదికగా నాలుగు ఆఫీసుల వసూల్లను ముందుకు తీసుకెళ్తూ, పెద్ద…

Read More

సృష్టి ఫెర్టిలిటీ కుంభకోణం తరహాలో కొత్త మెడికల్ మాఫియా బహిర్గతం – డాక్టర్ రాజా కొప్పల వివాదం

తెలంగాణలో మరో పెద్ద మెడికల్ కుంభకోణం బహిర్గతమైంది. “వాస్కులర్ సర్జన్” అని చెప్పుకుంటూ, అసలు అర్హతలేని ఒక రేడియాలజిస్ట్‌ భారీ స్థాయిలో ప్రజలను మోసం చేస్తున్నాడని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. డాక్టర్ రాజా కొప్పల అనే ఈ వ్యక్తి, రూరల్ రైతులకు ఉచిత చికిత్స అందిస్తానని చెప్పి NABARD నుంచి దాదాపు ₹20–₹25 కోట్ల వరకు లోన్ తీసుకున్నారని, అయితే నాబార్డ్ సాధారణంగా మెడికల్ ఫీల్డ్‌కి లోన్లు ఇవ్వదని ఆరోపణలు ఉన్నాయి. రిపోర్ట్స్‌ ప్రకారం, ఆయ‌న వాస్కులర్ సర్జన్‌…

Read More

క్యాబినెట్ బేటీలో రేవంత్ రెడ్డి హెచ్చరిక – “రోడ్డెక్కొద్దు, ప్రజల్లో చులకన కాకండి”

రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి వేడి చెలరేగింది. తాజాగా జరిగిన క్యాబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులకు స్పష్టమైన హెచ్చరిక జారీ చేసినట్లు సమాచారం.“రోడ్డెక్కొద్దు, ప్రజల్లో చులకన కావద్దు, అనవసర విషయాలకు రాద్దాంతం వద్దు” అంటూ సీఎం కఠినంగా స్పందించినట్టు తెలుస్తోంది. జూబ్లీ హిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో మంత్రుల మధ్య జరుగుతున్న విభేదాలు, పబ్లిక్ స్టేట్మెంట్లు, సోషల్ మీడియా వివాదాలపై సీఎం రేవంత్ అసహనం వ్యక్తం చేశారు. “ఇలాంటివన్నీ టీ కప్పులో తుఫాన్లు మాత్రమే. ప్రజల్లో గందరగోళం…

Read More