ఇంద్రేశం మున్సిపాలిటీలో అక్రమ నిర్మాణాల ఆరోపణలు.. ఫ్లాట్ నం.124లో నిర్మాణంపై దుమారం! అధికారుల తీరుపై తీవ్ర విమర్శలు

సంగారెడ్డి జిల్లా: అనుమతులు లేకుండా నిర్మాణాలు జరుగుతున్నాయనే ఆరోపణలతో సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలంలోని ఇంద్రేశం మున్సిపాలిటీ మరోసారి వార్తల్లోకి వచ్చింది. మున్సిపాలిటీ పరిధిలోని సర్వే నంబర్లు 162, 163, 164, 166 నుంచి 173, 181లోని ఫ్లాట్ నంబర్ సి-124లో జరుగుతున్న నిర్మాణంపై స్థానికులు, సామాజిక కార్యకర్తలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. నిర్మాణానికి అవసరమైన అనుమతులు ఉన్నాయా? మున్సిపల్ నిబంధనలకు అనుగుణంగానే నిర్మాణం జరుగుతోందా? అనే అంశాలపై స్పష్టత ఇవ్వాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఫ్లాట్…

Read Full News

సీలింగ్ భూముల్లో బటర్ఫ్లై సిటీ రెడీమిక్స్ ప్లాంట్.. అనుమతులు లేకుండా గలీజ్ దందా?

రంగారెడ్డి జిల్లాలో బటర్ఫ్లై సిటీ పేరుతో కొనసాగుతున్న రెడీమిక్స్ ప్లాంట్ వ్యవహారం తీవ్ర వివాదానికి దారితీసింది. Fortune Infra Developers Private Limited ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ ప్రాజెక్ట్‌పై స్థానిక రైతులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. కడ్తాల్ మండలం కొండ్రిగాని బోడు గ్రామ పంచాయతీ పరిధిలోని సీలింగ్ భూముల్లో ఎలాంటి అనుమతులు లేకుండా రెడీమిక్స్ ప్లాంట్ నిర్వహిస్తున్నారని వారు ఫిర్యాదు చేశారు. రైతుల కథనం ప్రకారం సర్వే నెంబర్ 790/39లో ఉన్న సుమారు 3.20 ఎకరాల భూమిని…

Read Full News

నవయుగ ఇంజనీరింగ్‌పై అక్రమ నిర్మాణ ఆరోపణలు.. కలెక్టర్ రిపోర్ట్ ఉన్నా కదలని అధికారులు

నగరంలో ప్రముఖ నిర్మాణ సంస్థ నవయుగ ఇంజనీరింగ్ కంపెనీపై అక్రమ నిర్మాణ ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. మేడ్చల్–మల్కాజగిరి జిల్లా పరిధిలోని బేగంపేట ప్రాంతంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి స్పష్టమైన నివేదికలు వచ్చినప్పటికీ సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సమాచారం ప్రకారం, సర్వే నంబర్లు 103 మరియు 103/2లో నిర్మాణానికి అనుమతి పొందిన నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ, వాస్తవానికి సర్వే నంబర్ 182లో…

Read Full News

మూసీ పైన ఆదిత్య వాంటేజ్ నిర్మాణం — నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న పనులు, అధికారులు మౌనం ఎందుకు?

హైదరాబాద్ నగరంలో మరో పెద్ద నిర్మాణ వివాదం చర్చనీయాంశమైంది. గండిపేట మండలం, నార్సింగ్ సర్కిల్ పరిధిలోని మూసీ నది ఒడ్డున శ్రీ ఆదిత్య వాంటేజ్ ప్రాజెక్టు నిర్మాణం పట్ల తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. స్థానికులు, పర్యావరణ కార్యకర్తలు, సామాజిక సంస్థలు — అందరూ ఒక్కటే ప్రశ్నిస్తున్నారు: “మూసీ బఫర్ జోన్‌లో ఇంత భారీ నిర్మాణం ఎవరికి అనుమతి ఇచ్చారు?” ఆరోపణల ప్రకారం, ఈ నిర్మాణం నాలా పైనే, మూసీ బఫర్ జోన్‌లోనే కొనసాగుతోంది. వర్షాకాలంలో గండిపేట జలాశయం…

Read Full News