తెలంగాణపై బీజేపీ ఫోకస్.. రేపు హైదరాబాద్‌కు ప్రధాని మోదీ, భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు

దేశ ప్రధాని నరేంద్ర మోదీ రేపు హైదరాబాద్‌కు రానుండటంతో తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా హాట్ టాపిక్‌గా మారింది. మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తెలంగాణలో ఆయన తొలి పర్యటన కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా ఇటీవల పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ సాధించిన విజయాల తర్వాత ఇప్పుడు పార్టీ ఫోకస్ పూర్తిగా తెలంగాణపై పడిందనే ప్రచారం జోరుగా సాగుతోంది.

ఈ పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ అధికారిక కార్యక్రమాలతో పాటు భారీ బహిరంగ సభలో కూడా పాల్గొననున్నారు. ఇప్పటికే బీజేపీ నాయకత్వం పరేడ్ గ్రౌండ్స్‌లో భారీ సభ ఏర్పాట్లను పూర్తి చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా కార్యకర్తలను సమీకరించే పనిలో పార్టీ నాయకులు నిమగ్నమయ్యారు. ఈ సభ ద్వారా తెలంగాణలో బీజేపీ బలాన్ని మరింత పెంచాలని పార్టీ హైకమాండ్ లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తోంది.

ప్రధాని పర్యటనలో భాగంగా హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో దాదాపు 8 వేల కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించనున్నారు. జహీరాబాద్ ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ అభివృద్ధి పనులు, గూడెబెల్లూరు–మహబూబ్‌నగర్ జాతీయ రహదారి పనులు, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ టెర్మినల్ నిర్మాణం వంటి పలు ప్రాజెక్టులకు ప్రధాని శ్రీకారం చుట్టనున్నారు.

ఇదిలా ఉండగా, బీజేపీ శ్రేణుల్లో మాత్రం ఈ పర్యటనపై భారీ అంచనాలు నెలకొన్నాయి. బెంగాల్ విజయంతో ఉత్సాహంగా ఉన్న పార్టీ నాయకులు తెలంగాణలో కూడా అదే జోష్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *