కేంద్ర బడ్జెట్ 2026పై భారీ అంచనాలు: రాయితీలు ధనవంతులకా… సామాన్యులకా?
రేపు పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ 9వ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. అంతర్జాతీయ ఆర్థిక అస్థిరతలు ఒకవైపు, దేశీయంగా పెరుగుతున్న ధరలు, నిరుద్యోగం, ఎంఎస్ఎంఈలపై ఒత్తిడి మరోవైపు ఉన్న ఈ సమయంలో వచ్చే బడ్జెట్‌పై సామాన్యుల నుంచి వ్యాపార వర్గాల వరకు భారీ అంచనాలు నెలకొన్నాయి. గత బడ్జెట్‌లో ఆదాయపన్ను ఉపశమనాలతో మధ్య తరగతి కొంత ఊరట పొందింది. ఈసారి పెద్ద సంస్కరణలు కాకపోయినా, స్టాండర్డ్ డిడక్షన్‌ను కొత్త పన్ను విధానంలో ₹75,000 నుంచి ₹1…

