యూసుఫ్‌గూడ బస్తీ పిల్లాడు నుంచి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే వరకూ – నవీన్ యాదవ్ విజయకథ!
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నూతన నాయకత్వం పుట్టుకొచ్చింది. యూసుఫ్‌గూడలో సాధారణ బస్తీలో పుట్టి పెరిగి, అడుగు అడుగునా ఎదుగుతూ చివరికి ఎమ్మెల్యే అయ్యిన నవీన్ యాదవ్ విజయకథ ప్రజల్లో ఆత్మీయతను రేకెత్తిస్తోంది. ఆయనను చిన్నప్పటి నుంచే చూసిన స్థానికులు ఇప్పుడు ఎంతో గర్వంగా “మనోడే ఎమ్మెల్యే అయ్యాడు” అని చెప్పుకుంటున్నారు. యూసుఫ్‌గూడ ఎంజీఎం స్కూల్ ప్రిన్సిపల్ ఎం.ఎం.నాయుడు మాట్లాడుతూ—“నవీన్ మా స్కూల్లోనే చదివాడు. చిన్నప్పటి నుంచి చురుకైనవాడు, సాఫ్ట్ స్పోకెన్. ఎంత ఉన్నత చదువులు చదివినా మమ్మల్ని…

