42% బీసీ రిజర్వేషన్ ఎందుకు ఆలస్యం? కోర్టు అడ్డంకులా.. రాజకీయ లెక్కలా?
తెలంగాణలో 42 శాతం బీసీ రిజర్వేషన్ అంశం ప్రస్తుతం రాజకీయంగా, న్యాయపరంగా తీవ్ర చర్చకు దారి తీసింది. ఇప్పటికే ఈ అంశంపై కోర్టులో కేసు పెండింగ్‌లో ఉండటంతో, నిర్ణయం ఎందుకు ఆలస్యమవుతోందన్న ప్రశ్నలు ప్రజల్లో తలెత్తుతున్నాయి. ఇది కోర్టు ప్రక్రియ వల్ల జరిగే ఆలస్యమా? లేక రాజకీయ కారణాలే ప్రధాన కారణమా? అన్నదానిపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. గత ప్రభుత్వాలు బీసీ వర్గాలకు న్యాయం చేయడంలో విఫలమయ్యాయని విమర్శలు ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగ పరమైన హామీలు ఉన్నప్పటికీ,…

