రవీంద్రభారతిలో విగ్రహ వివాదం: తెలంగాణ సంస్కృతి అవమానమంటూ సీఎం రేవంత్‌రెడ్డిపై తీవ్ర ఆగ్రహం
తెలంగాణలో రవీంద్రభారతిలో ప్రతిపాదిత విగ్రహావిష్కరణ అంశం తీవ్ర రాజకీయ–సాంస్కృతిక వివాదానికి దారి తీసింది. ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై కళాకారులు, కవులు, మేధావులు, జర్నలిస్టులు తీవ్రంగా మండిపడుతున్నారు. రవీంద్రభారతి అనేది కేవలం ఒక భవనం కాదు, తెలంగాణ ఆత్మగౌరవానికి, సాంస్కృతిక పోరాటాలకు ప్రతీక అని వారు స్పష్టం చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమ కాలంలో కానీ, కరువు–వలసలు–ఆత్మహత్యల వంటి ప్రజా సమస్యల సమయంలో కానీ తెలంగాణ ప్రజల కోసం గొంతెత్తని ఒక కమర్షియల్ ఆర్టిస్టుకు…

