జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో మాగంటి సునీత విజయం – కేసీఆర్ పునరాగమనానికి మొదటి అడుగు: బిఆర్ఎస్ నేత
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో బిఆర్ఎస్ పార్టీ నేతలు ఉత్సాహంగా స్పందించారు. స్వర్గీయ మాగంటి గోపీనాథ్ గారి అకాల మరణంతో ఏర్పడిన ఖాళీని పూడ్చేందుకు ఆయన సతీమణి మాగంటి సునీత గోపీనాథ్ గారిని అభ్యర్థిగా ప్రకటించారు. పార్టీ తరఫున మాట్లాడిన నాయకులు పేర్కొంటూ, “మాగంటి గోపీనాథ్ గారు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మూడు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసి పేదలకు, బలహీన వర్గాలకు విశేష సేవలు అందించారు. ఆయన స్థానంలో సునీత గారిని అభ్యర్థిగా నిలబెట్టడం కుటుంబానికి, ప్రజలకు అండగా నిలబడాలనే…

