కవిత స్థానంలో అజారుద్దీన్‌కు ఎమ్మెల్సీ పదవి.. కాంగ్రెస్‌లో కదలికలు

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన ఎమ్మెల్సీ పదవికి చేసిన రాజీనామాను శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తాజాగా ఆమోదించారు. దీంతో నిజామాబాద్ స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ స్థానం అధికారికంగా ఖాళీ అయ్యింది. 2021లో నిజామాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి కవిత ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. అయితే బీఆర్‌ఎస్‌ పార్టీతో విభేదాలు తలెత్తిన నేపథ్యంలో పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఆమెను సస్పెండ్ చేశారు….

Read More

వ్యక్తిగా వెళ్తున్నా.. శక్తిగా తిరిగొస్తా: బిఆర్ఎస్‌పై నిప్పులు చెరిగిన కవిత, కొత్త పార్టీ సంకేతాలు?

బిఆర్ఎస్ నుంచి ఘోరమైన అవమానాలు ఎదురయ్యాయని, అవినీతిపై ప్రశ్నించినందుకే తనపై కక్ష కట్టి పార్టీ నుంచి బయటకు పంపారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర ఆరోపణలు చేశారు. బిఆర్ఎస్ తనను సస్పెండ్ చేసిన నేపథ్యంలో ఆ పార్టీ ద్వారా లభించిన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. సోమవారం తెలంగాణ శాసన మండలి వేదికగా భావోద్వేగంగా మాట్లాడిన కవిత, “వ్యక్తిగానే ఈ సభ నుంచి వెళ్తున్నాను.. కానీ భవిష్యత్తులో ఒక శక్తిగా తప్పకుండా తిరిగి వస్తాను” అంటూ…

Read More