బీసీ రాజకీయ చైతన్యం పెరుగుతోంది… రిజర్వేషన్లు, బడ్జెట్ వాటాపై పోరాటానికి పిలుపు
ఈరోజు బీసీ పొలిటికల్ ఫ్రంట్ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయ సమావేశంలో రాష్ట్రంలో బీసీ రాజకీయ చైతన్యం పెరుగుతోందని నాయకులు తెలిపారు. సంస్థ చైర్మన్ బాలగోని బాలరాజుగౌడ్, వైస్ చైర్మన్ దుర్గేయ గౌడ్, కన్వీనర్లు ఐలి వెంకన్న, అంబాల నారాయణ, అలాగే బీసీ జనచైన్యం అధ్యక్షుడు నాగేష్ తదితరులు పాల్గొన్నారు. ఇటీవల జరిగిన మున్సిపల్, గ్రామ సర్పంచ్ ఎన్నికల ఫలితాలు రాష్ట్రంలో బీసీల రాజకీయ అవగాహన పెరుగుతోందని సూచిస్తున్నాయని నాయకులు పేర్కొన్నారు. సమాజంలో ఉన్న జనాభా నిష్పత్తికి…

