ఖైరతాబాద్‌లో ఉపఎన్నిక సంకేతాలు: ప్రజాభిప్రాయం, ఆరు గ్యారెంటీల ప్రభావం, స్థానిక అసంతృప్తి
ఖైరతాబాద్ నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. బీఆర్ఎస్ నుంచి గెలిచి తర్వాత కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే రాజీనామా చేసే అవకాశాల నేపథ్యంలో ప్రాంతంలో ఉపఎన్నిక వస్తుందనే చర్చలు బలంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే కడియం శ్రీహరి స్పీకర్‌ను కలిసి చర్చలు జరపడం కూడా ఈ ఊహాగానాలకు బలం చేకూర్చింది. ఈ పరిణామాలపై అక్కడి స్థానిక ప్రజలతో మాట్లాడితే మిశ్రమ స్పందనలు ఎదురయ్యాయి. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీలు ప్రజల్లో పూర్తిస్థాయి నమ్మకం నొంరావడంలేదన్న భావన…

