విశ్వంభర.. ఇది చిరంజీవికి మామూలు టాస్క్ కాదు! ‘మన శంకర వరప్రసాద్ గారు’ తర్వాత అసలైన పరీక్ష
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ మూవీతో గ్రాండ్ కమ్‌బ్యాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదలై అంచనాలను అందుకుని దూసుకుపోతోంది. ప్రీమియర్ షోల నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధిస్తోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.250 కోట్లకు పైగా వసూలు చేసినట్లు సమాచారం. త్వరలోనే…

