ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో స్టైఫండ్ దగాట: 25 వేల స్థానంలో 2 వేలే!
తెలంగాణలోని ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో వైద్య విద్యార్థులకు ఇవ్వాల్సిన స్టైఫండ్ విషయంలో భారీ అవకతవకలు వెలుగులోకి వచ్చాయి. కొన్ని కాలేజీలు అసలు స్టైఫండ్ ఇవ్వడమే లేదని, మరికొన్ని కాలేజీలు నిబంధనల ప్రకారం చెల్లించాల్సిన మొత్తానికి బదులుగా నామమాత్రపు మొత్తాలు మాత్రమే ఇస్తున్నాయని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఎన్ఎంసీ (నేషనల్ మెడికల్ కమిషన్) 2024–25 నివేదిక ప్రకారం పీజీ విద్యార్థులకు చెల్లించాల్సిన రూ.58,289 స్టైఫండ్‌ను సగానికి పైగా ప్రైవేట్ కాలేజీలు ఎగ్గొడుతున్నట్లు వెల్లడైంది. కాగితాలపై మాత్రం స్టైఫండ్ సక్రమంగా…

