గవర్నర్ కోటా ఎమ్మెల్సీలపై ఉత్కంఠ – కోదండరామ్, అజారుద్దీన్ ఫైళ్లపై రాజ్‌భవన్ నిర్ణయం కోసం ఎదురుచూపులు
గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల నియామకాల విషయంలో మరోసారి ఉత్కంఠ నెలకొంది. ప్రొఫెసర్ కోదండరామ్, అజారుద్దీన్ పేర్లను క్యాబినెట్ సిఫారసు చేసి రాజ్‌భవన్‌కు పంపిన ఫైళ్లపై గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ అంశంపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని సుప్రీంకోర్టు ఇప్పటికే స్పష్టత ఇవ్వడంతో, ఇప్పుడు పూర్తిగా గవర్నర్ నిర్ణయంపైనే దృష్టి కేంద్రీకృతమైంది. క్యాబినెట్ పంపిన సిఫారసులను ఆమోదిస్తారా? లేక అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఫైల్‌ను తిరిగి పంపుతారా?…

