2025లో కాంగ్రెస్ పాలనపై తీవ్ర అసంతృప్తి.. పంచాయతీలు, పాలనా వైఫల్యాలు, ప్రజల ప్రశ్నలు
2025 సంవత్సరం తెలంగాణ రాజకీయాల్లో అన్ని పార్టీలకూ చేదు అనుభవాలనే మిగిల్చిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. బిఆర్ఎస్, బిజెపీల తర్వాత కాంగ్రెస్ పార్టీ పాలన కూడా తీవ్ర విమర్శలకు లోనైంది. ముఖ్యంగా కాంగ్రెస్‌లో బీసీ వర్సెస్ రెడ్డి రాజకీయాలు తెరపైకి రావడం, అంతర్గత పంచాయతీలు రోడ్ల మీదకు రావడం పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీశాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడూ పంచాయతీలకు “కేర్ ఆఫ్ అడ్రస్” అన్నట్టుగా పరిస్థితి మారిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక మంత్రి మరో…

