65 మిర్రర్ వెబ్‌సైట్లతో భారీ పైరసీ రాకెట్: 21,000 సినిమాలు, 50 లక్షల యూజర్ల డాటా కలిగిన నెట్వర్క్ బస్టెడ్
ఒక పెద్ద ఆన్‌లైన్ పైరసీ రాకెట్‌ను పోలీసులు భూమికి తీసుకొచ్చారు. ప్రధాన నిందితుడు ఒక వెబ్‌సైట్‌ను అధికారులు బ్లాక్ చేసిన వెంటనే, మరో 65కి పైగా మిర్రర్ వెబ్‌సైట్లు సృష్టించి సినిమాలను మళ్లీ అప్‌లోడ్ చేస్తూ సంవత్సరాలుగా భారీ నెట్‌వర్క్ నడిపినట్లు విచారణలో బయటపడింది. పోలీసులు నిందితుడి హార్డ్‌డిస్క్‌ను రికవర్ చేసినప్పుడు అందులో 21,000 సినిమాలు ఉన్నట్లు షాకింగ్ సమాచారం వెల్లడైంది. 1972లో వచ్చిన క్లాసిక్ గాడ్ ఫాదర్ సినిమా నుంచి ఇటీవల వచ్చిన ఓజి వరకు…

