మూసీ పైన ఆదిత్య వాంటేజ్ నిర్మాణం — నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న పనులు, అధికారులు మౌనం ఎందుకు?
హైదరాబాద్ నగరంలో మరో పెద్ద నిర్మాణ వివాదం చర్చనీయాంశమైంది. గండిపేట మండలం, నార్సింగ్ సర్కిల్ పరిధిలోని మూసీ నది ఒడ్డున శ్రీ ఆదిత్య వాంటేజ్ ప్రాజెక్టు నిర్మాణం పట్ల తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. స్థానికులు, పర్యావరణ కార్యకర్తలు, సామాజిక సంస్థలు — అందరూ ఒక్కటే ప్రశ్నిస్తున్నారు: “మూసీ బఫర్ జోన్‌లో ఇంత భారీ నిర్మాణం ఎవరికి అనుమతి ఇచ్చారు?” ఆరోపణల ప్రకారం, ఈ నిర్మాణం నాలా పైనే, మూసీ బఫర్ జోన్‌లోనే కొనసాగుతోంది. వర్షాకాలంలో గండిపేట జలాశయం…

