మూసీ నది ప్రక్షాళనపై అసెంబ్లీలో చర్చ: అభివృద్ధి, పునరావాసంపై సభ్యుల ప్రశ్నలు
హైదరాబాద్ నగర అభివృద్ధిలో కీలక అంశంగా నిలుస్తున్న మూసీ నది ప్రక్షాళన ప్రాజెక్ట్‌పై అసెంబ్లీలో విస్తృత చర్చ జరిగింది. నగరాన్ని గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దాలంటే మూసీ నది అభివృద్ధి అత్యవసరమని సభ్యులు అభిప్రాయపడ్డారు. చర్చ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ, గతంలో కూడా మూసీ నది పరివాహక ప్రాంతాల్లో సోషియో ఎకనామిక్ సర్వే నిర్వహించి సుమారు 10 వేల కుటుంబాలను గుర్తించినట్లు పేర్కొన్నారు. ఆ కుటుంబాల్లో కొందరికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చినా, ఇప్పటికీ పూర్తిస్థాయిలో…

