తుని మైనర్ బాలికపై అత్యాచారం కేసు – నిందితుడు నారాయణరావు ఆత్మహత్య చేసుకున్నాడా? కుటుంబం అనుమానాస్పద మరణమని ఆరోపణలు
తుని పట్టణంలో జరిగిన మైనర్ బాలికపై అత్యాచారం కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ఘటనలో నిందితుడైన నారాయణరావు ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు చెబుతుండగా, కుటుంబ సభ్యులు మాత్రం ఇది సూసైడ్ కాదు, అనుమానాస్పద మరణం అని ఆరోపిస్తున్నారు. నారాయణరావు తుని కొండవారి పీటకు చెందినవాడు. అతడి ఇంటి పక్కనే మైనర్ బాలిక ఇల్లు ఉండేది. పాప గురుకుల పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతోంది. బాలిక తండ్రి లేకపోవడంతో కుటుంబం కష్టాల్లో ఉందని తెలిసిన నారాయణరావు, ఆమెపై…

