జూబ్లీహిల్స్ ఉపఎన్నిక: బిఆర్ఎస్ ఆత్మవిశ్వాసం, కాంగ్రెస్–బిజెపి పై విమర్శలు
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. మూడు పార్టీలు — బిఆర్ఎస్, కాంగ్రెస్, బిజెపి — అన్ని క్షేత్రస్థాయిలో ప్రజల్లో చురుకుగా ప్రచారం చేస్తున్నారు. ఈ ఉపఎన్నిక రాబోయే సార్వత్రిక ఎన్నికలకు దిశానిర్దేశం చేసే కీలకమైన ఎన్నికగా భావిస్తున్నారు. బిఆర్ఎస్ సీనియర్ నాయకుడు మల్లెపాక యాదగిరి మాట్లాడుతూ, “జూబ్లీహిల్స్ ఎన్నిక అనివార్యంగా వచ్చినప్పటికీ, మాగంటి గోపీనాథ్ గారి సేవలు ప్రజల గుండెల్లో నిలిచిపోయాయి. ఆయన సతీమణి మాగంటి సునీత గారికి ప్రజల అండ…

