ఆర్మూర్ రాజకీయాల్లో వేడి పెంచిన ఆరోపణలు: కబ్జా, అవినీతి ఆరోపణలపై నేత ఘాటు వ్యాఖ్యలు
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మొదటిసారి మద్దతిచ్చిన జిల్లాగా నిజామాబాద్‌కు ప్రత్యేక గుర్తింపు ఉందని పేర్కొన్న ఓ సీనియర్ నాయకుడు, మళ్లీ అదే ఊపు జిల్లాలో కనిపిస్తోందని అన్నారు. బోధన్‌లో ఇటీవల నిర్వహించిన సమావేశంలో గులాబీ జెండా ఎగిరేసినట్లు, నిజామాబాద్ అర్బన్‌లోనూ తామే కీలక శక్తిగా అవతరిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఆర్మూర్ నియోజకవర్గంలో అయితే పరిస్థితి పూర్తిగా వన్ సైడ్‌గా ఉందని, టీఆర్‌ఎస్ (బీఆర్ఎస్)కు…

