పోలింగ్ కేంద్రంలో పోలీసులపై ఎంపీ అరవింద్ ఆగ్రహం… కేసు నమోదు, పలు చోట్ల ఎన్నికల ఉద్రిక్తత
మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిజామాబాద్‌లో పోలింగ్ కేంద్రం వద్ద పోలీసులపై పరుష పదజాలంతో మాట్లాడిన బీజేపీ ఎంపీ ధర్మపూర్ అరవింద్‌పై కేసు నమోదైంది. ఎన్నికల విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బందిని బెదిరిస్తూ దూషించారని ఆరోపణలు రావడంతో చర్యలు తీసుకున్నట్లు నిజామాబాద్ వన్‌టౌన్ ఎస్హెచ్ఓ రఘుపతి తెలిపారు. బుధవారం పోలింగ్ సందర్భంగా 287వ పోలింగ్ బూత్ వద్ద బీజేపీ అభ్యర్థిని పోలీసులు బయటకు పంపారన్న సమాచారం తెలుసుకున్న ఎంపీ అరవింద్ అక్కడికి చేరుకున్నారు….

