పటంచేరు నూతన ప్రభుత్వ దవాఖానకు డాక్టర్ అల్లాని కిషన్ రావు పేరు పెట్టాలన్న డిమాండ్ వేడెక్కింది
ఔషధ, రసాయన పరిశ్రమల కేంద్రంగా పేరుగాంచిన పటంచేరు, ఒకప్పుడు తీవ్రమైన కాలుష్యం, నీటి కొరతతో ప్రజలు ఇబ్బందులు పడిన ప్రాంతం. అదే పరిస్థితిని మారుస్తూ పర్యావరణ పరిరక్షణ కోసం తన జీవితం అంకితం చేసిన దివంగత డాక్టర్ అల్లాని కిషన్ రావు పేరు మరోసారి ప్రజలు, నాయకులు, మేధావులు గుర్తు చేసుకుంటున్నారు. పటంచేరు లో నిర్మాణం పూర్తయిన 300 కోట్ల రూపాయల నూతన సూపర్ స్పెషాలిటీ ప్రభుత్వ హాస్పిటల్‌కు ఆయన పేరు పెట్టాలన్న డిమాండ్ పెద్ద ఎత్తున…

