కామారెడ్డిలో ఉద్రిక్తతలు… బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావు అరెస్ట్‌పై నిరసనలు
కామారెడ్డిలో రాజకీయ ఉద్రిక్తతలు మరింత ముదిరాయి. స్థానిక ఎమ్మెల్యే వెంకటరమణ రెడ్డి కార్యాలయంపై జరిగిన దాడిని నిరసిస్తూ బయలుదేరిన ఎన్. రామచంద్రరావును పోలీసులు అరెస్ట్ చేయడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. ఈ చర్యపై స్పందించిన భారతీయ జనతా పార్టీ నేతలు, ఇది అధికార దుర్వినియోగమని ఆరోపించారు. ప్రజాస్వామ్య హక్కులను అణిచివేసే చర్యలుగా అరెస్టులను అభివర్ణించారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రతిపక్షాలను అణగదొక్కే ప్రయత్నం చేస్తోందని బీజేపీ నేతలు విమర్శించారు….

