బీసీలను మోసం చేసిన కాంగ్రెస్ — రాష్ట్ర వ్యాప్తంగా ఆగ్రహావేశం
రాష్ట్రంలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో బీసీ రిజర్వేషన్ల విషయంలో న్యాయం జరగలేదంటూ రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. బీసీ సంఘాలు, ఉద్యమ కమిటీలు, రాజకీయ ఫ్రంట్లు ఏకతాటిపైకి వచ్చి, “ఈ ఎన్నికలు న్యాయమైనవి కావు” అంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నాయి. బీసీలకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ, పలు సంఘాలు నిరసనలు చేపట్టగా, మరోవైపు న్యాయస్థానాల్లో పిటిషన్లు కూడా దాఖలు అయ్యాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియను తక్షణమే వాయిదా వేయాలని బీసీ నేతలు డిమాండ్…

