ఫోన్ ట్యాపింగ్ కేసులో డేటా ధ్వంసం మిస్టరీ: కేటీఆర్‌పై ప్రశ్నల వర్షం, విచారణపై సందేహాలు
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మరోసారి కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో ప్రధానంగా డేటా ధ్వంసం వెనుక ఎవరి ఆదేశాలు ఉన్నాయి? అనే అంశం ఇప్పుడు వార్తల్లో ప్రధానంగా చర్చకు వస్తోంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఎస్ఎస్ఐబి కార్యాలయంలోని హార్డ్ డిస్క్‌ల డేటాను ఎందుకు ధ్వంసం చేశారన్న ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ఎదుట విచారణకు హాజరైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై అధికారులు ప్రశ్నల వర్షం…

