తెలంగాణను కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చే కుట్ర:రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ నిలిపివేతపై బక్క జార్సన్ సంచలన ఆరోపణలు
తెలంగాణను కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చే దిశగా కుట్ర జరుగుతోందని కాంగ్రెస్ మాజీ నేత బక్క జార్సన్ సంచలన ఆరోపణలు చేశారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్, ప్రభుత్వ ఖర్చులపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రిటైర్డ్ ఉద్యోగులకు ఇప్పటికీ సుమారు ₹11 వేల కోట్లకు పైగా బెనిఫిట్స్ బకాయిలుగా ఉన్నాయని బక్క జార్సన్ తెలిపారు. ఇవి ప్రభుత్వ దయాదాక్షిణ్యాలు కాదని, ఉద్యోగులు తమ సేవాకాలంలో కష్టపడి…

