సీఎం రేవంత్ ఆదేశాలతో చెక్ పోస్టుల ఎత్తివేత — రవాణా శాఖలో ఏఐ మార్పులు, ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీపై ప్రజల ఆవేదన
తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రవాణా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని రవాణా చెక్ పోస్టులను ఎత్తివేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మంత్రి పొన్నం ప్రభాకర్ లేఖ ఆధారంగా, కమిషనర్ ఉత్తర్వుల ప్రకారం బుధవారం సాయంత్రం 5 గంటలలోగా అన్ని చెక్ పోస్టులను మూసివేసి రికార్డులు జిల్లా కార్యాలయాలకు తరలించాలని ఆదేశించారు. చెక్ పోస్టుల్లో ఇంతకుముందు ఏసీబీ తనికీల్లో లెక్కల్లో లేని పెద్ద మొత్తంలో నగదు స్వాధీనం…

