కోదాడ లాక్‌అప్ డెత్‌లో పోలీసులే బాధ్యులు: ఎస్ఐ సురేష్ రెడ్డి అరెస్ట్ చేయాలి – ఎంఆర్పీఎస్ డిమాండ్
కోదాడలో జరిగిన కర్ల రాజేష్ లాక్‌అప్ డెత్ కేసులో ఇది పూర్తిగా పోలీసుల చేతిలో జరిగిన హత్యేనని ఎంఆర్పీఎస్ నేతలు తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ మేరకు నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో వారు మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా జరుగుతున్న అన్ని ఎన్‌కౌంటర్లను పోలీసు హత్యలుగా చెప్పలేముగానీ, లాక్‌అప్ డెత్‌లన్నీ మాత్రం వందకు వంద శాతం పోలీసుల హత్యలేనని స్పష్టం చేశారు. 2025 సంవత్సరంలోనే ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 1650కి పైగా కస్టోడియల్ మరణాలు జరిగాయని, ఇది పోలీసు వ్యవస్థ వైఫల్యానికి స్పష్టమైన…

