ఎవరు శాశ్వతం కాదు.. ప్రజా చైతన్యాన్ని తక్కువ అంచనా వేయొద్దు: కేటీఆర్ వ్యాఖ్యలు
ప్రజా చైతన్యాన్ని ఎవరూ తక్కువ అంచనా వేయకూడదని కేటీఆర్ అన్నారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన, రాజకీయాల్లో ఎవరు శాశ్వతం కాదని, “నేనే రాజు, నేనే మంత్రి” అన్న భావనతో ఉండేవారు కాలక్రమంలో కనుమరుగైపోతారని వ్యాఖ్యానించారు. దేశ రాజకీయాల్లో కూడా ఇదే జరిగిందని ఆయన గుర్తుచేశారు. ఇందిరా గాంధీ వంటి శక్తివంతమైన నాయకులు, ఎన్టీ రామారావు వంటి ప్రజాదరణ పొందిన నేతలు కూడా ఓటమిని చూశారని తెలిపారు. తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించిన…

