జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయం లో కలకలం… ప్రసాద లడ్డులో పురుగులు ఉన్నాయన్న భక్తుల ఆరోపణలు
హైదరాబాద్‌లోని జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రసాదంగా విక్రయించే అభిషేకం లడ్డులపై తీవ్ర వివాదం నెలకొంది. ఆలయంలో విక్రయించిన లడ్డులో పురుగులు కనిపించాయని భక్తులు ఆరోపిస్తూ వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో పంచుకోవడంతో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. భక్తుల వాదన ప్రకారం, సుమారు ₹150కి విక్రయించే అభిషేకం లడ్డును కొనుగోలు చేసి తెరిచి చూడగా అందులో కదులుతున్న పురుగులు కనిపించాయని వారు చెబుతున్నారు. ప్రసాదాన్ని ఎంతో పవిత్రంగా భావించే భక్తులకు ఇది తీవ్ర మనస్తాపానికి…

