జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో వివాదాలు… ఇంచార్జ్ వీసీ టి. గంగాధర్‌పై తీవ్ర ఆరోపణ
హైదరాబాద్‌లోని జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో పరిపాలనా వ్యవహారాలపై తీవ్ర వివాదాలు నెలకొన్నాయి. ఇంచార్జ్ వైస్ ఛాన్సలర్‌గా కొనసాగుతున్న టి. గంగాధర్ వ్యవహార శైలిపై ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నట్లు సమాచారం. వర్సిటీలో నియామకాలు, పదోన్నతులు, పాలనా నిర్ణయాలు నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. తనకు అనుకూలంగా ఉన్న వ్యక్తులకు ప్రమోషన్లు ఇవ్వడం, సీనియారిటీ ఉన్న ఫ్యాకల్టీని పక్కన పెట్టడం, అర్హతలు లేని వారికి కీలక బాధ్యతలు అప్పగించడం వంటి…

