బాలానగర్ భూముల కుంభకోణం: ప్రభుత్వానికి ₹3 కోట్లు, బంధుమిత్రులకు ₹30 కోట్లు?
బాలానగర్ ప్రాంతంలో భూముల ధరలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఇదే ప్రాంతంలో ఇప్పుడు గజం ధర లక్షా యాభై వేల రూపాయలు వరకు ఉంది. అయితే ప్రభుత్వ విధానాల పేరుతో భూములను అతి తక్కువ ధరకు కొంతమందికి కట్టబెట్టే ప్రయత్నం జరుగుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వివరాల్లోకి వెళితే, రిజిస్ట్రేషన్ విలువ ప్రకారం బాలానగర్‌లో ఎకరానికి కేవలం ₹10,000 మార్కెట్ వాల్యూ చూపించి, అదిలో 30% మాత్రమే అంటే కేవలం ₹3,000 చెల్లిస్తే చాలు, భూమి వారిది అవుతుంది…

