రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల కోసం రేణుక చౌదరి నివాసం ముట్టడి.. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం
తెలంగాణలో రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల సమస్య మరోసారి రాజకీయ దుమారానికి కారణమైంది. తమకు రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇప్పటికీ విడుదల చేయకపోవడంపై ఆగ్రహంతో రిటైర్డ్ ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నేతలు రాజ్యసభ సభ్యురాలు రేణుక చౌదరి నివాసాన్ని ముట్టడించారు. రిటైర్ అయిన ఉద్యోగులకు రావాల్సిన గ్రాట్యుటీ, జీపీఎఫ్, టీజీఎల్ఐ, డీఏలు, పీఆర్సీ వంటి బెనిఫిట్స్ రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కొక్కరికి 45 లక్షల నుంచి 60 లక్షల రూపాయల వరకు బకాయిలు…

