సాయి ఈశ్వరాచారి మరణం: బీసీ రిజర్వేషన్‌పై ఆగ్రహం, ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అంశం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీస్తోంది. బీసీ వర్గానికి చెందిన సాయి ఈశ్వరాచారి ఆత్మహత్యయత్నం చేసి తరువాత మరణించడం రాష్ట్రవ్యాప్తంగా భారీగా చర్చనీయాంశమైంది. ఇది సాధారణ మరణం కాదని, రాజకీయ హామీల మోసం చేయడంతో వచ్చిన నిరాశ, ఆవేదన ఈ పరిణామానికి దారితీసిందని బీసీ సంఘాలు, ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ఘటన హిమాయత్‌నగర్‌లో ఉన్న తీన్మార్ మల్లన్న ఆఫీస్ ముందు జరిగింది. అక్కడే పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న సాయి ఈశ్వర్‌ను వెంటనే స్థానికులు…

