రెవంత్‌రెడ్డికి బీజేపీ సవాల్: హామీల అమలుపై ఓపెన్ డిబేట్‌కి రావాలి!
భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరిగిన భారీ సభలో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వినిపించాయి. సభ ప్రారంభం నుంచే భారత మాతాకి జై, వందే మాతరం, భారతీయ జనతా పార్టీ జిందాబాద్ నినాదాలతో వేదిక సందడిగా మారింది. పెద్ద సంఖ్యలో విద్యార్థులు, యువత, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. వేదిక మీద బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు, జాతీయ నాయకులు పొంగులేటి సుధాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ కొమరయ్య, ఎమ్మెల్యే కోటిపల్లి వెంకటరమణా రెడ్డి సహా పలువురు…

