సచివాలయంలో భారీ మార్పులు – ఒకేసారి 134 ఏఎస్ఓల బదిలీ, మంత్రులు–సెక్రటరీల మధ్య విభేదాలు తీవ్రం
తెలంగాణ సచివాలయంలో ప్రభుత్వం మరోసారి భారీ పరిపాలనా మార్పులు చేసింది. ఒకేసారి 134 మంది అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ల (ఏఎస్ఓ) బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే. రామకృష్ణరావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. గత ఏడాది ఉన్నతాధికారుల బదిలీల తర్వాత, కింది స్థాయిలో ఇదే మొదటిసారి ఇంత పెద్ద ఎత్తున మార్పులు చోటు చేసుకున్నాయి. ఒకే శాఖలో ఏళ్ల తరబడి పని చేస్తున్న అధికారులపై ఈసారి ప్రభుత్వం దృష్టి సారించింది. కొంతమంది ఏఎస్ఓలు 12…

