“హైదరాబాద్‌లో 5 లక్షల కోట్ల భూకుంభకోణం జరుగుతోందా? – రేవంత్ ప్రభుత్వంపై కేటీఆర్ సంచలన ఆరోపణలు”
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి భూవివాదాలు కేంద్రబిందువుగా మారాయి. పారిశ్రామిక భూముల క్రమబద్ధీకరణ పేరుతో ప్రభుత్వం భారీ కుంభకోణానికి తెరలేపిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన Hyderabad Industrial Lands Transformation Policy (HILTP) ప్రజా ప్రయోజన పాలసీ కాదని, ఇది “దేశంలోనే అతిపెద్ద భూకుంభకోణానికి నాంది” అని వ్యాఖ్యానించారు. ▼ 9292 ఎకరాల విలువైన పారిశ్రామిక భూములు లక్ష్యం? బాలానగర్, జీడిమెట్ట,…

