సాయిశ్వరాచారి ఆత్మహత్య కాదు… బీసీల హక్కుల ద్రోహం!”
తెలంగాణ రాజకీయాల్లో బీసీ రిజర్వేషన్లపై మరోసారి మంటలు రేగుతున్నాయి. బీసీ రిజర్వేషన్ హామీ అమలు చేయకపోవడంతోనే సాయిశ్వరాచారి ఆత్మహత్య చేసుకుంటే, దానికి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని బీసీ సంఘాలు తీవ్రంగా ఆరోపిస్తున్నాయి. ఉద్యమ నేతలు మాట్లాడుతూ: “ఆనాడు తెలంగాణ కోసం శ్రీకాంతాచారి ప్రాణాలు అర్పించాడు… ఈనాడు బీసీల కోసం సాయిశ్వరాచారి బలి అయ్యాడు. ఈ రెండు ఘటనలకూ కారణం కాంగ్రెస్ పార్టీ ద్రోహం.” అని మండిపడ్డారు. రెండు సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను నమ్మబలికి, “ఆరు నెలల్లో…

