సీఎం ఆదేశాలు గాలికి వదిలేస్తున్న బ్యూరోక్రసీ? ఫీల్డ్ విజిట్లకు దూరంగా ఉన్న సెక్రటరీలు
హైదరాబాద్‌ను దాటి ఫీల్డ్ విజిట్‌కు వెళ్లాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలను రాష్ట్ర బ్యూరోక్రసీ పెద్దగా పట్టించుకోవడం లేదన్న తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫైల్ క్లియరెన్స్‌లో నిర్లక్ష్యం, క్షేత్రస్థాయి పర్యటనల లేమి, ప్రభుత్వ ప్రాధాన్యతలపై అవగాహన లేకపోవడం వంటి అంశాలపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. విదేశీ పర్యటనకు వెళ్లే ముందు అన్ని శాఖల సెక్రటరీలు తప్పనిసరిగా ఫీల్డ్ విజిట్‌కు వెళ్లాలని, ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా పని చేయాలని సీఎం స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు….

