మూసీ సుందరీకరణపై గందరగోళం: ఖర్చు ఎంత? పరిహారం ఏమైంది? ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించిన బీఆర్ఎస్
మూసీ నది సుందరీకరణ ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ప్రశ్నిస్తూ బీఆర్ఎస్ పార్టీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది. ఒకసారి లక్ష కోట్లు, మరోసారి లక్ష 50 వేల కోట్లు ఖర్చు పెడతామని ముఖ్యమంత్రి వేర్వేరు సందర్భాల్లో వేర్వేరు ప్రకటనలు చేయడం ప్రజల్లో గందరగోళం సృష్టిస్తోందని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. అసలు మూసీ సుందరీకరణకు ప్రభుత్వం ఖర్చు చేయదలచుకున్న మొత్తం ఎంతనేది సూటిగా చెప్పాలని డిమాండ్ చేశారు. ఒకవైపు విద్యార్థుల స్కాలర్షిప్లకు నిధులు లేవని, రిటైర్డ్ ఉద్యోగులకు…

