కడియం శ్రీహరికి స్పీకర్ నోటీసులు – పార్టీ ఫిరాయింపుల కేసు విచారణపై ఉత్కంఠ
పార్టీ ఫిరాయింపుల కేసులో స్టేషన్ గన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నోటీసులు జారీ చేశారు. బుధవారం ఉదయం 11 గంటలకు విచారణకు హాజరుకావాలని స్పీకర్ ఆదేశించారు. బిఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ దాఖలు చేసిన పిటిషన్‌పై స్పీకర్ స్వయంగా విచారణ జరపనున్నారు. ఇప్పటికే పార్టీ ఫిరాయింపుల ఆరోపణలపై ఎనిమిది మంది ఎమ్మెల్యేల విచారణ పూర్తయింది. తెల్లం వెంకట్రావ్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాలే యాదయ్య, బండ్ల కృష్ణమోహన్, గూడె మహిపాల్…

