రెవెన్యూ పేరుతో యూనివర్సిటీలను రియల్ ఎస్టేట్ హబ్‌లుగా మార్చే ప్రయత్నం: మౌలానా ఆజాద్ యూనివర్సిటీ విద్యార్థుల ఆగ్రహం
తెలంగాణ ప్రభుత్వం రెవెన్యూ జనరేషన్ పేరుతో విద్యాసంస్థల భూములపై కన్నేయడం తక్షణమే ఆపాలని మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీ విద్యార్థులు, పరిశోధకులు డిమాండ్ చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలంటే క్యాంపస్ బయట చేయాలని, యూనివర్సిటీ భూములను తాకొద్దని ప్రభుత్వానికి స్పష్టమైన హెచ్చరిక ఇచ్చారు. ఇది కేవలం రొటీన్ సర్వే అంటూ టూరిజం మంత్రి చేసిన వ్యాఖ్యలను విద్యార్థులు ఖండించారు. ఇదే తరహా ప్యాటర్న్‌ను గతంలో బిజినెస్ స్కూల్స్, సెంట్రల్ యూనివర్సిటీల విషయంలో కూడా…

