టెన్త్ క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్ ప్రారంభం: మొదటి రోజు పేపర్ ఈజీగా వచ్చిందంటున్న విద్యార్థులు
తెలంగాణలో టెన్త్ క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్ ప్రారంభమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా మొదటి రోజు పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. మొదటి పరీక్షగా తెలుగు ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ నిర్వహించారు. పరీక్ష అనంతరం విద్యార్థులతో మాట్లాడగా, చాలా మంది పేపర్ ఈజీగా వచ్చిందని చెప్పారు. విద్యార్థుల ప్రకారం ప్రశ్నాపత్రం ఎక్కువగా ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఆధారంగా వచ్చింది. అందువల్ల చాలా మంది అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయగలిగామని తెలిపారు. ఇక ఎగ్జామ్ సెంటర్లలో ఇన్విజిలేషన్ కూడా కాస్త స్ట్రిక్ట్‌గా ఉందని విద్యార్థులు చెబుతున్నారు….

