మేడారంలో చరిత్రాత్మక క్యాబినెట్ భేటీ: 18న మంత్రివర్గ సమావేశం, మున్సిపల్ ఎన్నికలపై కీలక నిర్ణయాలు?
తెలంగాణ చరిత్రలో తొలిసారిగా రాష్ట్ర మంత్రివర్గ సమావేశం హైదరాబాద్‌కు దూరంగా, ములుగు జిల్లా మేడారంలో నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 18న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమ్మక్క–సారలమ్మ మేడారం జాతర ప్రాంతంలో క్యాబినెట్ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ క్యాబినెట్ సమావేశంలో ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి డెడికేటెడ్ కమిషన్ నివేదికకు ప్రభుత్వ ఆమోదం తెలిపే అవకాశం ఉందని…

