భూపాలపల్లి అభివృద్ధి ఎవరి ఖాతాలో? కాంగ్రెస్‌పై బీఆర్‌ఎస్ నేతల ఘాటు విమర్శలు
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జరిగిన భారీ బహిరంగ సభలో బీఆర్‌ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. భూపాలపల్లి ఈరోజు ఈ స్థాయికి రావడానికి కారణం గతంలో జరిగిన అభివృద్ధి పనులేనని స్పష్టం చేశారు. డిగ్రీ కాలేజీ, జూనియర్ కాలేజీ, మెడికల్ కాలేజీ, బస్ డిపో, మున్సిపాలిటీతో పాటు గల్లీ గల్లీకి రోడ్లు, ఇంటింటికి తాగునీరు వంటి మౌలిక వసతులు ఎవరి పాలనలో వచ్చాయో ప్రజలకు బాగా తెలుసని అన్నారు. మారుమూల ప్రాంతాల్లో బ్రిడ్జిల…

